వాల్నట్స్ను ఆహారంగా తీసుకోవడం డయాబెటిస్ టైప్-2 బారిన పడే ముప్పు సగానికి తగ్గుతుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. రోజూ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాల్నట్ తీసుకునే వాళ్లతో పోలిస్తే 3 టేబుల్ స్పూన్ల వాల్నట్స్ తినేవాళ్లలో మధుమేహం ముప్పు 47 శాతం తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు.