మనిషి ఆరోగ్యాంగా వుండడడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఏసీ రూంస్ లో కూర్చుని పని చేస్తున్నప్పుడు దాహం గా అనిపించదు. దాంతో నీరు తాగడం మర్చిపోతుంటారు. అలా కాకుండా, ఒక వాటర్ బాటిల్ డెస్క్ మీదే పెట్టుకుంటే దాన్ని చూసినప్పుడల్లా నీరు తాగాలని గుర్తుకి వస్తుంది. లేదా, లంచ్ లోపు ఈ బాటిల్ లో ఉన్న నీరు తాగేయాలి అని నియమం పెట్టుకోవచ్చు. నీరు తాగడానికి కూడా ఒక పద్ధతుంది అని చెబుతున్నారు నిపుణులు. నిలబడి నీరు తాగడం వల్ల కిడ్నీస్ మీద ప్రెజర్ పెరుగుతుందట. చిన్న గ్లాసు నీరు తాగినా సరే, ఎప్పుడూ కూర్చునే తాగాలి. అలాగే, నెమ్మదిగా తాగాలి. కొంచెం నీరు తాగి అవి మింగిన తరువాత ఒక నిమిషం ఆగి ఇంకొంచెం నీరు తాగడం వల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ లేకుండా ఉంటుంది.