వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేయాలి. మీ ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చు. ఇక యోగాతో మానసిక, శరీరాక ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే, కంటి నిండ నిద్ర కూడా చాలా అవసరం. అర్ధరాత్రిళ్లు జాగారం చేస్తూ తక్కువ నిద్రపోయే వ్యక్తులు కూడా త్వరగా అనారోగ్యానికి గురవ్వుతారని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయి. కాబట్టి.. సమయానికి నిద్రపోవడాన్ని అలవాటుగా మార్చుకోండి.