అలాగే అల్లం టీ తాగడం వలన దగ్గు, ఏమైనా గొంతు సమస్యలు రావు. కాబట్టి రోజుకి రెండు పూటలు అల్లం టీ తాగండి. దగ్గుతో బాధ పడేవారికి అల్లం టీ ఒక మంచి టానిక్ ల పని చేస్తుంది. కాబట్టి దగ్గు వున్న లేకపోయినా అల్లం టీ త్రాగడం అలవాటు చేసుకోండి. అల్లం, పసుపులో జీవక్రియను పెంపొందించే సమ్మేళనాలు ఉన్నాయి. అలాగే కొవ్వును కరిగించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఒక వేళ రెండిటికీ న్యాయం చేయాలని అనుకుంటే ఒక వారం అల్లం టీ, మరో వారం పసుపు టీ ట్రై చేయండి. కాదంటే.. అల్లం టీకి కాస్త పసుపును చేర్చి తాగండి. అప్పుడు.. అల్లం, పసుపులోని పోషకాలన్నీ పొందవచ్చు.