కోవిడ్ లక్షణాలు ఉన్నవారి కంటే...ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్ బాధితుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో స్పష్టమైంది. ఈ సంస్థ కరోనాబారిన పడిన 210 మంది డేటాను సేకరించి, విశ్లేషించగా ఈ విషయం స్పష్టమైంది. 70శాతం మంది ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నారని, ఇలాంటి వారిలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉండి, ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఈ పరిశోధనలో తేలింది.