ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది.గర్భిణీ స్త్రీలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే పుట్టే పిల్లలు మానసిక అవకరాలతో జన్మించే రిస్క్ చాలా ఎక్కువ.ఎముకలు బలహీన పడిపోయి ఆస్టియోపొరాసిస్ రావచ్చు.కో ఆర్డినేషన్ దెబ్బ తింటుంది. బాలెన్స్ కోల్పోతారు. సరిగ్గా నడవలేరు.బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా బ్యాలెన్స్ అవ్వవు.చేతులూ, పాదాలు మొద్దు బారినట్టు ఉండడం, తిమ్మిరెక్కడం, నొప్పిగా ఉండడం వంటివి ఆల్కహాల్ వల్ల సెంట్రల్ నెర్వస్ సిస్టం దెబ్బ తినడానికి సూచన. కాబట్టి ఆల్కాహాల్ కి అసలు అలవాటు పడకండి. నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.