పక్షవాతం రాకుండా ఉండాలంటే ముందుగా కచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే.. మద్యపానం, ధూమపానం మానేయడం.ఈ అలవాట్లు ఉంటే కచ్చితంగా పక్షవాతం వచ్చే అవకాశం వుంది. కాబట్టి తక్షణమే మద్యపానం, ధూమపానం మానుకోండి. ఎందుకంటే వీటి ప్రభావం ఎక్కువగా మన మెదడు పై పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వుంది. షుగర్, బీపి వున్నవావారికి, అలాగే 50 ఏళ్ల వయసు పైబడిన వారికి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకోండి. బరువు పెరగకుండా వ్యాయామం, యోగ రెగ్యులర్ గా చేయండి. సమతుల ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. బీపీ 130/80 లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు తినే ఆహారంలో ఉప్పు కొంచెం తగ్గించండి. జంక్ ఫుడ్ తినడం మానేయండి. రోజు గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యండి.