ప్రస్తుతం మూడో దశ ప్రయోగ స్థాయిలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు విజయవంతం అయ్యే అవకాశం 50 శాతం మాత్రమేనని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ అడ్వైజరి కమిటీ సభ్యురాలు గగన్ దీప్ కాంగ్. ఆమె మాటలను బట్టి చూస్తే.. వ్యాక్సిన్ వచ్చినా దాని సక్సెస్ రేటు కేవలం 50 శాతం మాత్రమే. అంటే వందమందిలో యాభై మందికి మాత్రమే అది సమర్థంగా పనిచేస్తుంది. మిగతా 50మంది విషయంలో వ్యాక్సిన్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు.