రాత్రి మంచి నిద్ర పట్టాలంటే ముందుగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం మానుకోండి. ఏమైనా మంచి పుస్తకాలు కాని లేకుంటే ఏమైనా పవిత్ర గ్రంథాలు చదవడం అలవాటుగా మార్చుకోండి. అప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఏమైనా మంచి మెలోడీ సాంగ్స్ వినండి. మంచి వినసొంపైన పాటలు వినడంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచిగా నిద్ర పడుతుంది. అలాగే నిద్రపోయేముందు ఒక గ్లాసు పాలు తాగడం అలవాటు చేసుకోండి. పాలు మైండ్ ని రిలాక్స్ గా ఉంచుతుంది. కాబట్టి మంచి నిద్ర పడుతుంది.