డయబెటీస్ తో బాధపడేవారు రోజూ మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులు జుట్టు రాలే సమస్యను అరికడుతాయి. రంగు కూడా నెరవకుండా కాపాడతాయి. జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మెంతుల పొడి, పెరుగు కలిపి నానబెట్టి జుట్టు రాసి, మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది.