డయాబెటీస్ (మధుమేహం)తో బాధపడుతున్నవారు అరటి పువ్వు కూరను తింటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయట.అరటి పువ్వుని తినడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది.మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అరటిపువ్వులో ఉంటే విటమిన్-C వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు, కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా అరటి పువ్వు మంచిదట.