ఊబకాయం, వయసు మీద పడిన వారిలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువై ఆసుపత్రిపాలైతే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుందని అంటున్నారు వైద్యులు. పైగా బాలు ఎక్మో నుంచి బయటకు రాలేదు, అయినా ఈ పరిస్థితి వచ్చిందంటే ఊపిరితిత్తులు తీవ్రంగా డ్యామేజీ అయి ఉండాలని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకొని నెగెటివ్ వచ్చినా, ఎక్మో చికిత్స చేసినా అంతర్గత అవయవాలపై వైరస్ చేసిన దాడితో మృతిచెంది ఉంటారని వైద్యులు అంటున్నారు.