అధిక ప్రోటీన్లు కలిగిన పాలను తాగడం వల్ల చక్కెర స్థాయిలు ఎందుకు నియంత్రణలో ఉంటున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నించిన పరిశోధకులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. పాలలో సహజంగా ఉండే కేసైన్ ప్రోటీన్లు, పాల నుంచి ఉత్పతయ్యే గ్యాస్ట్రిక్ హార్మోన్లు వల్ల జీర్ణక్రియ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఫలితంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండే చక్కెర స్థాయిలు ఒక్కసారే శరీరానికి అందకుండా క్రమబద్ధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు.