మనం నిమిషానికి పదిహేను సార్లు కనురెప్పలు ఆర్పుతామని ఒక అంచనా. ఇందు వల్ల కంటిలో నీరు కన్ను మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కన్ను హైడ్రేటెడ్ గా ఉంటుంది. కానీ, కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు మనం అన్ని సార్లు బ్లింక్ చేయం. అందుకని, నాచురల్ గా బ్లింక్ చేయడం అలవాటు చేసుకోండి. అవసరమనుకుంటే ఆర్టిఫిషియల్ టియర్స్ తో సప్లిమెంట్ చేయండి. తగినన్ని సార్లు బ్లింక్ చేయకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ కూడా వస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్సెస్ వాడుతున్నట్లైతే వాటి నుండి కూడా అప్పుడప్పుడూ కళ్ళకి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే, అవి కూడా డ్రై ఐస్ ని కలుగచేస్తాయి.