ఉప్పు మనం తీసుకునే ఆహారంలో అత్యంత ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే దాన్ని మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం. లేకపోతే అనారోగ్యమే. 40శాతం సోడియం, 60శాతం క్లోరిన్ ఉండే ఉప్పు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు సమర్ధంగా పనిచేసేట్టు చేస్తుంది. రక్తప్రసరణ సాఫీగా సాగేట్టు చూడటమే కాకుండా కండరాలు ఉత్సాహంగా పనిచేసేలా ఉంచుతుంది. అంతేకాదు శరీరంలో అవసరమైన నీటిశాతాన్ని ఉంచేలా చూసుకుంటుంది. చిన్న పేగులకు కావాల్సిన ఆహారాన్ని సరఫరా చేయడంలో ఉప్పుదే కీలక పాత్ర.