శరీరంపై వున్న అవాంఛిత రోమాలు తొలగించేటప్పుడు బ్లెడ్స్ ని తుప్పు పట్టకుండా చూసుకోండి. బ్లేడ్స్ ను రీప్లేస్ చేసే రేజర్స్ ని ఎంచుకోండి. షేవింగ్ తరువాత రేజర్స్ లో మాయిశ్చర్ లేకుండా చూసుకోండి.ఇరిటేటెడ్ స్కిన్ ను షేవ్ చేయకండి. అలర్జీస్, ర్యాషెస్ లేదా గాయాలు ఉన్నట్టయితే షేవింగ్ ను అవాయిడ్ చేయడం మంచిది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఇరిటేటెడ్ స్కిన్ పై మ్యాజిక్ చేస్తాయి. స్కిన్ ను హీల్ చేస్తాయి. కాస్తంత తేనెని స్కిన్ పై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత వెచ్చటి నీటితో కడిగేయండి.