హోల్ ఫుడ్స్ మీద ఫోకస్ చేయండి. వీటిలో ఉప్పు తక్కువగా ఉంటుంది.పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. అప్పుడు మీ ఎలెక్ట్రొలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. బంగాళా దుంపలు, బ్రకోలి, బనానా వంటివి పొటాషియం ఎక్కువగా ఉండే పదార్ధాలు.మీరు తీసుకునే ఫుడ్ లో ఒక క్యాలరీకి ఒక మిల్లీ గ్రాం ఉప్పు కంటే ఎక్కువగా తీసుకోకూడదు అనే రూల్ పెట్టుకోండి. ఆటోమేటిక్ గా ఉప్పు తీసుకోవడం తగ్గుతుంది.ఉప్పు బదులు లెమన్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, వాము పొడి, మిరియాల పొడి, ఒరెగనో వంటివి యూజ్ చేయవచ్చు.వంట మొదట్లో ఉప్పు వేసే బదులు చివర్లో వేస్తే ఉప్పు తక్కువ వేయవచ్చు.