ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవల్స్ భారీగా తగ్గుతాయి. అలాగే చాలా మంది రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నారు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలి. ఇక రోజూ ఇలా వాకింగ్ చెయ్యటం వలన షుగర్ వ్యాధిని తరిమి కొట్టెయ్యొచ్చు.