బాగా పీచు పధార్థం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ పరిమాణంలో రోజుకు రెండుసార్లుగా తీసుకోవటం కంటే చిన్న చిన్న మొత్తాలలో తరచుగా తీసుకోవాలి. పూర్తిగా మానివేయటం మంచిది కాదు. రాత్రిళ్ళు పుళ్కాలు, చపాతీలు తినాలి. రక్తంలో గ్లూకోజ్ తక్కువ కాకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో మజ్జిగ, టమాటా రసం, నిమ్మరసం, పళ్ళ రసాలను తీసుకోవచ్చు. పండుగల రోజులలో ఉపవాసం ఉండకూడదు.