రకరకాల స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా, టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. కాబట్టి తల , మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.తల నొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి.