గుడ్డు పెంకుల వల్ల ఎముకలు, దంతాలకు 1000 నుంచి 1500 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్-డి కూడా లభిస్తుంది. త్వరగా అలసిపోవడం, పనిలో చిరాకు, ఒత్తిడి లాంటి సమస్యలను కాల్షియం లేదా విటమిన్-డి లోపంగా భావించాలి. అలాంటివారు గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే తగిన కాల్షియం శరీరానికి లభిస్తుంది. అత్యధిక కాల్షియం పిల్లలు, వృద్ధులకే అవసరం అవుతుంది.గుడ్డుపెంకు మీద అనేక బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. కాబట్టి.. పెంకులను వేడి నీటిలో కనీసం 20 నుంచి 30 నిమిషాలు మరిగించి, పొడిగా చేసుకుని తీసుకోవాలి. పెంకులు పెంకులుగా తీసుకుంటే.. అంతర్గత అవయవాలకు హాని కలగవచ్చు.