చిలగడదుంపల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ C, E, B6, బీటా కేరోటిన్, పొటాషియం, ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ దుంపలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ అధికం. ఇవి శరీరంలో విటమిన్-A తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఈ చిలగడదుంప సహకరిస్తుంది.