తుమ్మును బలవంతంగా ఆపేందుకు ప్రయత్నిస్తే మెదడులోని రక్త నాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీచెస్టర్‌కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. ఇకపై తుమ్మేప్పుడు నోరు, ముక్కును బలవంతంగా మూసే ప్రయత్నం చేయొద్దు. ఇతరులకు ఇబ్బందని భావిస్తే.. చేతి రుమాలును నోటికి, ముక్కుకు కొంచెం దూరంలో ఉంచి తుమ్మండి. దీనివల్ల వాటికి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఒక వేళ మీరు మాస్క్ ధరించి ఉంటే ఇంకా మంచిది. ఆ మాస్క్‌లోనే తుమ్మేసి, దాన్ని పక్కన పెట్టేయండి. వేరొక మాస్క్‌ను పెట్టుకోండి.