తాజా వేపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడగండి. కొద్దిగా రోజ్ వాటర్ కలిపి వీటిని చిన్న రోట్లె దంచండి. కొద్దిగా ముల్తానీ మిట్టి కూడా కలిపి కుదిరినంత మెత్తటి పేస్ట్ లా దంచండి.ఈ పేస్ట్ ని రాత్రి నిద్ర కి ముందు అప్లై చేయండి. అప్లై చేసే ముందు శుభ్రం గా ఫేస్ వాష్ చేసుకుని మెత్తని బట్టతో అద్ది ఆ తరువాత అప్లై చేయడం మర్చిపోకండి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ పింపుల్స్ ప్రాబ్లం డెబ్భై నుండి ఎనభై శాతం వరకు సాల్వ్ అయిపోతుంది.