రోజు బాదం పప్పులు తినడం ఆరోగ్యానికి చాలామంచిది. ఎందుకంటే ఇది రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి.. హై బీపీతో బాధపడేవారికి బాదం మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. బాదం శరీరంలోని చెడు కొవ్వు (LDL)ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-E, మెగ్నీషియం, పోటాషియంలు రక్త నాళాల్లో ప్రవాహం సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీనివల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.