తల్లి పాలు తాగని పిల్లల్లో జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. చెవి ఇన్ఫెక్షన్లు రావడం లాంటివి జరగవచ్చు. ఇక అంతే కాకుండా స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువ. తల్లి పాలు తాగని పిల్లలు పెద్దయిన తర్వాత త్వరగా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో కనిపించే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.