రాగి చెంబులో నిల్వ వుంచిన నీరు తాగడం వల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, వాతం వంటివి రాకుండా నివారిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది,వృధాప్యం రాకుండా అరికట్టొచ్చు. జుట్టు తొందరగా తెల్లబడదు. గుండె, కాలేయం, జీర్ణవ్యవస్థలు చురుకుగా పనిచేస్తాయి. శరీరంలోని బాక్టీరియాని నశింపచేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.గాయాలను నయం చేస్తుంది.రక్తపోటుని తగ్గిస్తుంది.చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కనుక రాగి పాత్రలో నిల్వవుంచిన నీరు రోజు తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు.