ఒళ్ళు కాలినప్పుడు వెన్నపూస,బేకింగ్ సోడా పోయడం, టూత్ పేస్ట్ పెట్టడం, ఆయింట్మెంట్ రాయడం, బాడీ లోషన్ తో పాటు నూనెలు పోయడం లాంటి పనులు చేయకూడదు. ఒళ్ళు కాలినప్పుడు చేయవలసిన పనులు ఏమిటంటే ఒళ్ళు కాలినప్పుడు చల్లని నీళ్లతో గాయాన్ని కడగాలి. ఒక ధారలాగా పడుతున్న నీటి కింద కాలిన భాగాన్ని ఉంచాలి. ఒకవేళ కాలిన శరీరాన్ని బట్టలతో కప్పవలసి వస్తే ఆ బట్టలను నీటితో తడిపి ఆ తర్వాత కప్పవలసి ఉంటుంది. మంటలు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.