అన్నం పాత్రలో వండి గంజిని వార్చినట్టయితే అలా ఉడికిన గంజి ద్వారా న్యూట్రీషన్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్,కొవ్వులు ఇలా అన్నీ కూడా బయటకు పోతాయి. అంతేకాకుండా ఫోలెట్,ఫాస్పరస్,మెగ్నీషియం, ఐరన్ వంటి న్యూట్రీషియన్ లు కూడా అన్నం లో ఉంటాయి. అన్నాన్ని వండి, వార్చి నట్టయితే అవన్నీ బయటికి పోతాయి. ఇక ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం ద్వారా ఎలాంటి న్యూట్రీషియన్స్ బయటకు పోవు. ఒకవేళ ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండుకొని తినడం ఇష్టం లేకపోతే అన్నం ని వార్చకుండా, తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు