మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాలలో 9 కేలరీలు ఖర్చవుతాయి. ఇక 30 నిమిషాల నడక 25 కేలరీలను ఖర్చు చేయడానికి దోహదపడుతుంది. సాధారణంగా నడిచే నడక కన్నా కొంత వేగంగా నడిస్తే 15 నిమిషాలలో 25 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే 30 నిమిషాలలో 50 కేలరీలకు పైగా ఖర్చు అవుతాయి. ఇక బ్రిస్క్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే అనుకున్నంత ఫలితాలు తొందరగా పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులతో పాటు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కేవలం 30 నిమిషాలలో 250 కేలరీలను ఖర్చు చేయవచ్చట. వెనక్కి తిరిగి నడవడం వల్ల గుండె పనితీరు వేగవంతమవుతుంది. ఎక్కువ క్యాలరీలు సైతం ఖర్చు అవుతాయి.