ఎక్కిళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే,బార్లీ గింజలను ఉడికించి, పెరుగు వేసి బాగా చిలికితే పల్చటి మజ్జిగలా అవుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా మానిపోతాయి. మరమరాలు, పేలాలు, బిర్యానీ ఆకు, వెలగ చెట్టు ఆకుల రసం ఇవన్నీ కూడా ఎక్కిళ్ళను తగ్గిస్తాయి. ధనియాలు,జీలకర్ర, అల్లం ఎండిన ముక్క ఈ మూడింటిని ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకొని, కొత్తగా పొడి చేసి అందులో తగినంత ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి. ఇక ఎక్కిళ్ళు ఆగకుండా వేధిస్తున్నట్లు అయితే ఈ పొడిని కొద్దిగా పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.