ఆరు లేదా ఏడు మిరియాలను తీసుకొని, మెత్తగా దంచి,పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్లో తీసుకొని, అందులో అర చెక్క నిమ్మరసం పిండాలి. ఇప్పుడు ఇందులో పావు భాగం గోరువెచ్చని నీటిని కలపాలి. ఇక అన్నింటినీ బాగా కలిపి ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి. మీకు తలనొప్పి వచ్చిన వెంటనే ఈ నీటిని తాగండి. కొన్ని నిమిషాల్లోనే మీ తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నీటిని తాగాలి.మిర్యాల గాటు వల్ల ముక్కు రంధ్రాలు సక్రమంగా పనిచేసి రక్తం లో ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి దోహదపడతాయి. శ్వాస రంధ్రాలు ఎప్పుడైతే బాగా పనిచేస్తాయో అప్పుడు సైనస్ సమస్య కూడా దరిచేరదు.