రక్త పోటు మన శరీరంలో దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం, ముఖ్య అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అలాగే హార్ట్ ఎటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాకుండా కంటి జబ్బులు,పక్షవాతం వంటి సమస్యలు చుట్టుముడతాయి. అయితే రక్తపోటుకి ప్రత్యేకమైన లక్షణాలు అంటూ ఏవి ఉండవనే చెప్పాలి. సాధారణంగా వచ్చే సమస్య లు తలనొప్పి, తల తిరిగినట్లు ఉండడం, కింద పడిపోయినట్లు అనిపించడం, కోపం లాంటి ఇబ్బంది తదితర సాధారణ లక్షణాలను బట్టి మనం అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది