కొవాగ్జిన్ వ్యాక్సిన్ 50 నుంచి 60 శాతం సమర్థవంతమైనది అని చెబుతుంటే, కొవి షీల్డ్ వ్యాక్సిన్ 70 శాతం మేలైనది అని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కొవి షీల్డ్ వ్యాక్సిన్ నెగిటివ్ కోణం ఏమిటంటే ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు శక్తివంతంగా పని చేయలేదు. కానీ కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రం అందరిలోనూ ఒకేవిధంగా పనిచేస్తుంది. పైగా ప్రస్తుతం సరి కొత్తగా వచ్చిన యూకే స్ట్రెయిన్ కి వ్యతిరేకంగా కూడా పని చేస్తోందని చెబుతున్నారు. వ్యాక్సిన్ ను గర్భవతుల పై,పిల్లలపై ఇలాంటి అధ్యయనం జరపలేదు. కాబట్టి వీరు తప్ప మిగతా వాళ్లంతా ఈ 2 వ్యాక్సిన్ లలో దేన్నైనా అవసరమైతేనే తీసుకోవచ్చు.