ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల వీటిలో ఉండే పీచు దనం పెరిగి మలబద్ధకం, నీరసం వంటివి తగ్గిపోతాయి. శరీరం ఎక్కువ సేపు ఉత్సాహంగా ఉంటుంది. అంతే కాకుండా శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు కూడా తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్లు వంటివి కూడా తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు.చద్దన్నం పులియడం వల్ల అందులో ఐరన్,పొటాషియం, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు స్థాయి పెరుగుతుంది. ఉదాహరణకు రాత్రి వండిన వందగ్రాముల అన్నంలో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ వుంటే అది తెల్లారేసరికి 73.91 మిల్లీగ్రాముల వరకూ పెరుగుతుందట. అంతేకాకుండా విటమిన్ బి 6, విటమిన్ బి12 కూడా అధికంగా లభిస్తాయట.