నిమ్మరసం, బెల్లం ఈ రెండింటినీ కలిపి నిత్యం తీసుకుంటే అధిక బరువును జయించవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ అలాగే ఉంచి, ఆ తరువాత పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా ప్రతిరోజు పరగడుపున ఈ పానీయం సేవించడం వల్ల అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.