కరివేపాకు టీ తాగడం వల్ల మూత్రాశయం బాగా పనిచేస్తుంది. అలాగే గ్యాస్, మలబద్ధకం, కడుపులో మంట విరేచనాల సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కరివేపాకు టీ లో ఉండే అరోమా నరాలను రిలాక్స్ చేసి,ఒత్తిడిని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ కరివేపాకు టీని తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటూ నీరసం, వికారం, వాంతులు కావడం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా కరివేపాకు టీ విరోచనాలకు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలెక్స్ కారణంగా చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇక చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.