ఒకవేళ మీరు గనక మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లైతే,అందుకు ఆముదం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపు మీద కొద్దిగా ఆముదం నూనె రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాల సంకోచాన్ని పెంచి, మలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా మలవిసర్జన సక్రమంగా జరుగుతుంది. ఇక మరొక చిట్కా.. ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె లో, ఒక కప్పు నారింజ రసం కలిపి తాగడం వల్ల మల విసర్జన సజావుగా జరుగుతుంది. నారింజ రసంలో ఉండే ఫైబర్ అలాగే ఆముదం మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి..