చెరుకు రసం సంతానోత్పత్తికి మంచిగా పనిచేసే ఒక బూస్టర్ అని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొత్తగా తల్లి అవుతున్న వాళ్ళలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇక మగవారిలో శుక్రకణాల నాణ్యత కూడా మెరుగుపరచడానికి చెరుకురసం ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో మహిళలు పడే బాధలో ఒకటైన కడుపునొప్పి నుండి బయట పడాలి అంటే చెరకు రసం తాగడం ఉత్తమం. అయితే ఇందుకోసం నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుంచే చెరకు రసం తాగాల్సి ఉంటుంది.