మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కిడ్నీ సమస్య ఉన్నట్లే అని గుర్తించాలి. మరీ ముఖ్యంగా కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచిని సరిగా ఆస్వాదించలేకపోవడం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచూ వికారం, వాంతులు రావడం లాంటివి జరుగుతాయి. ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల అలసట, నీరసం, క్రమంగా మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రక్తహీనత కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా కిడ్నీలు ఉండే ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు, రాళ్ల కు కూడా కారణమవుతాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ మన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి..