ఆహార విషయంలో ఆక్సలైట్ వున్న ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆక్సలైట్ కలిగి ఉన్న బీట్రూట్, ఆకుకూరల్లో ఒకటి అయినటువంటి బచ్చలికూర, చాక్లెట్ వంటి పదార్థాలను తినకూడదు. అంతేకాకుండా మాంసాహారం కూడా తీసుకోకూడదు. దీంతోపాటుగా పాలకు కూడా చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా చల్లటి నీటిని ఫ్రిజ్లో పెట్టుకొని తాగకూడదు. మరియు చల్లటి పానీయాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.