పూర్వం నుంచి అందరికీ తెలిసిన అరటి పండ్లలో రకాలు కర్పూరం, అమృతపాణి. అయితే ఈ రెండు రకాలు అరుదుగా దొరికే పండ్లు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరికే ఈ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా చేకూరుస్తాయి. అంతేకాకుండా వీటిలో చక్కెరకేళి పండ్లు కూడా ఉంటాయి. అప్పట్లో అరటిపండులో రారాజు అంటే చక్కరకేళి అని చెప్పే వాళ్ళు. అయితే ఈ అరటి పండ్లు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా,గుంటూరు జిల్లాలలో మాత్రమే లభిస్తాయి. మామూలు అరటి పళ్ళ తో పోలిస్తే వీటి ధర కూడా కొంచెం ఎక్కువే. కార్బైడ్ వేసి బాగా పండించిన పండ్ల కంటే, స్వతహాగా మాగిన పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి.