జలుబు, పొడి దగ్గు మరీ విపరీతంగా ఉండి బాధిస్తుంటే, పసుపు ను పాలలోకి వేసుకొని తాగడం వల్ల ఎలాంటి దగ్గు అయినా సరే ఇట్టే తరిమేయవచ్చు అంటున్నారు డాక్టర్ బీ ఎన్ సిన్హా.. ఈయన సూచించిన ప్రకారం ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు, అర టేబుల్ స్పూన్ పసుపును ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వేసుకొని తాగడం వల్ల గొంతు సమస్యలు క్లియర్ అవుతాయి అని చెప్పుకొచ్చారు. దగ్గు మరీ ఎక్కువగా వేధిస్తుంటే గ్లాసు పాలలో పసుపు తో పాటు కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా లవంగం వేసుకొని కూడా తాగవచ్చు. వెల్లుల్లి వాసన పడనివారు వెల్లుల్లికి ప్రత్యామ్నాయంగా అల్లం ను వేసుకొని త్రాగవచ్చు.