నిమ్మకాయ నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక నిమ్మలో విటమిన్ సి, రోగనిరోధక పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. నిద్ర లేవగానే నిమ్మ రసం కలిపినా నీళ్లు తాగి మొదలు పెడితే ఇక రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. వికారం గా ఉన్న , నిద్ర సరిగ్గా రాకపోయినా, అలసటగా ఉన్నా, కడుపులో జీర్ణం కాకపోయినా ఈ సమస్యలకు పరిష్కారం నిమ్మకాయలలో ఉంది.