చాల మందికి వయస్సు పెరుగుతుంది కానీ హైట్ మాత్రం పెరగకుండా పోట్టిగా ఉండిపోతారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతుంటారు. సాధారణంగా హైట్ పెరగడం అంటే అమ్మాయిలు 18 సంవత్సరాల వరకు అబ్బాయిలు 20 సంవత్సరాల వరకు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. ఇక 18 ఏళ్లు దాటిన తర్వాత హైట్ పెరగడం ఆగిపోతారు. ఈ క్రమంలోనే వారి వెన్నుముక పెరగడం, మృదులాస్తి కోల్పోవడం జరుగుతుంది.