కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు దానిమ్మ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. దానిమ్మ పండ్లు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బ్రహ్మాండంగా పనిచేస్తాయని సైంటిస్టులు కూడా చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ జువాలజీ విభాగం, సౌదీ అరేబియాలోని కింగ్ సౌత్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ జువాలజీ విభాగం సైంటిస్టులు సంయుక్తంగా ఎలుకలపై పరిశోధనలు నిర్వహించి, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .దానిమ్మ పండ్లను నేరుగా లేదా వాటి పొట్టును లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి అని గుర్తించారు. ముఖ్యంగా కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు దానిమ్మ పండు జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని తెలిపారు.