అమెరికాకి చెందిన న్యూరో సైంటిస్ట్ స్కాట్ కనోస్కీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. కనోస్కీ గత కొన్ని సంవత్సరాలుగా ఎలుకల్లో ఆహారం, మెదడు పనితీరు మధ్య సంబంధాల పై అధ్యయనం చేస్తున్నారు. చక్కెర పానీయాల వినియోగం ఎలుకల జ్ఞాపకశక్తి పనితీరును దెబ్బతీస్తుందని ఆయన గుర్తించారు. అందుకే చిన్న వయసులో ఉన్నప్పుడు చక్కెర వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు ఎదిగే క్రమంలో నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని అధ్యయన బృందం సభ్యులు ఎమిలీ నోబెల్ తెలిపారు..