సాధారణంగా నీళ్లు ఎక్కవగా తాగాలని పెద్ద వాళ్ళు, ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. అయితే మనం ఆహారాన్ని ఎలాగైతే సరిపడా తీసుకుంటామో… అలాగే నీటిని కూడా మన శరీరానికి అవసరం ఉన్నంత వరకే తాగాలి తప్ప ఎక్కువగా తాగకూడదు. అలా ఎక్కువగా నీటిని తాగితే మన ఆరోగ్యానికి సమస్యలు తప్పవని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.