ఆకాకరకాయ తినడం వల్ల శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను, ఇందులోని పోషకాలు నాశనం చేస్తాయి. క్రమంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదు.. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.. ఆకాకరకాయ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అంతేకాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఫలితంగా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ఇందులో ఫ్లేవనాయిడ్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.