సాధారణంగా చెవి లోపలి భాగాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చెవిలోపల చర్మం కన్వేయర్ బెల్ట్ లా పని చేసి,లోపలి వ్యర్థాలను బయటకు తోసేస్తుంది. అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా చెవి లోపల గులిమి బయటకు తీయాలని ప్రయత్నిస్తే, అది ఇంకా లోపలికి వెళ్లి కర్ణభేరి పై పడుతుందట. అయితే ఇలా ఎక్కువ సంఖ్యలో గులిమి కర్ణభేరి పై పేరుకుపోవడం వల్ల సున్నితమైన కర్ణభేరి, తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలను సృష్టించే సామర్ధ్యం కోల్పోతుంది. క్రమంగా చెవుడు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ..